పడవ ప్రమాదంలో 85 మందికి గాయాలు
హాంకాంగ్ నుంచి చైనాలోని మకావు వెళ్తున్న నౌక 'హైడ్రోఫోయిల్' తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 85 మంది గాయపడ్డారని హాంగ్ కాంగ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్న ఆయన, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. సముద్రపు అడుగు భాగంలో ఏదో వస్తువు నౌక అడుగు భాగాన్ని బలంగా ఢీ కొట్టిందని తెలిపారు. నౌకకు ఏ ప్రమాదం జరగలేదని ఆయన తెలిపారు. ప్రమాదానికి గురైనప్పుడు నౌకలో మొత్తం 107 మంది ప్రయాణీకులతో పాటు 10 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఘటనపై ఆ దేశ మెరైన్ మంత్రిత్వ శాఖ దర్యాప్తుకు ఆదేశించిందని వెల్లడించారు.